11000-employees-resigned-from-tcs-infosys-wipro-hcl-tech-in-last-90-days

గత 90 రోజుల్లో 11,000 మంది ఉద్యోగులు TCS, Infosys, Wipro, HCL నుండి రాజీనామా చేశారు

Technology

భారతదేశంలోని టాప్ ఐదు సాఫ్ట్‌వేర్ సంస్థలు ఈ త్రైమాసికంలో తమ ఉద్యోగులను వరుసగా తగ్గిస్తున్నాయి. దీనికి కారణం COVID-19 , మహమ్మారి వలన చాలా కంపెనీలు ఖర్చు తగ్గించే చర్యలను తీసుకుంటున్నారు ఇది ఉద్యోగుల నియామకం పై ప్రభావం చూపిస్తుంది

ఏదేమైనా, ఈ సంస్థలలో చాలావరకు రాబోయే త్రైమాసికంలో నియామకాలు చాలా సానుకూలంగా ఉంటాయి అని అంచనా.

టాప్ 5 భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఉద్యోగుల సంఖ్య తగ్గుమొఖం పడుతోంది. గత ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో, భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఉద్యోగుల సంఖ్య 4,786 తగ్గింది. ఇన్ఫోసిస్ లో ఉద్యోగుల సంఖ్య లో 3,138 మంది, విప్రో లో 1082 మంది మరియు టెక్ మహీంద్రా 1820 లో మంది వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది.
మొత్తంగా, ఈ కంపెనీలన్నీ 10,962 మంది ఉద్యోగుల ఉద్యోగుల సంఖ్యలో క్షీణతను గమనించాయి.

ఇన్ఫోసిస్ COO, ప్రవీణరావు మాట్లాడుతూ నియామకం నిలిపివేయబడింది, అయితే, ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 5000 మందికి పైగా లాటరల్స్ ని నియమించినట్టు తెలిపారు. ఈ నియామకాలు రిమోట్‌గా ఆన్‌బోర్డ్ చేయబడ్డాయి. ” కరోనా ఇంకా కొంతకాలం అలాగే ఉంటుంది అందువలన ఆన్ మరియు ఆఫ్ మరియు రిమోట్ ఆన్‌బోర్డింగ్ చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇది కొనసాగుతుంది.” ఈ ఏడాది కూడా 20,000 మంది ఫ్రెషర్లను నియమించనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.

COVID-19 మహమ్మారి వ్యాప్తి అన్ని సంస్థల నియామకాలను స్తంభింపచేసింది మరియు అదనంగా, ఆటోమేషన్ రంగం ఉపయోగం కూడా పెరుగుతుండటం కొత్త నియామకాలు తగ్గడానికి కారణం.

Leave a Reply

Your email address will not be published.