గణిత శాస్త్రంలో ఎంత కష్టం అయినా లెక్కలు అయినా సులువుగా వేగంగా పరిష్కరించి fastest human calculator రికార్డు ని సంపాదించి గిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేసుకున్న వారిలో ప్రముఖులలో స్కాట్ ఫ్లఅంస్బుర్గ్ ఒకరు. మరియు శకుంతల దేవి వంటి వారి రికార్డు ని ఒక 20 ఏళ్ల బాలుడు దాటివేసి ఒక సంచలనం సృష్టించాడు.
అతని పేరు నీలకంఠ భాను ప్రకాష్, హైదరాబాద్ నివాసి అయినా ఈతడు ఇటీవల లండన్లో Mind Sports Olympiad వారు నిర్వహించిన Mental Calculation Word Championship లో సువర్ణ పథకం సంపాదించాడు మరియు Fastest Human Calculator అను పేరును సంపాదించాడు.
చిన్నపడి నుండే భానుకి గణితం అంటే చాల ఇష్టం అసక్తి ఉండేవి అదే పట్టుదలతో చిన్నపడి నుండే SPI abacus పోటీలలో పాల్గొనే వాడు ఆలా 2011 లో International abacus Champion 13 పథకం మరియు 2012 లో national abacus champion పథకం సంపాదించాడు.
అయితే ఈ పోటీ 1997 లో మొదలు అయినది అప్పటినుండి సంవత్సరానికి ఒకసారి లండన్ లో నిర్వహిస్తారు కానీ ఈసారి కోవిద్ కారణంగా మొదటి సారి ఆన్లైన్ లో నిర్వహించారు.ఈ పోటీలో భాను సుమారు ౩౦ మంది ఇతర దేశాల వారితో పోటీపడ్డాడు మరియు తన తరవాత విజయం సాధించిన వారికంటెయి 65 మార్కుల తో ముందంచాలో నిలిచాడు.
‘రికార్డులు వస్తాయ్ పోతాయ్ నాకు వాటితో పేరుప్రతిష్టలు పొందాలి అని లేదు కానీ ఇలా నాలాంటి వారందరితో కలిసి ఒక Human calculators అనే సంగం ఏర్పాటు చేయాలి అనేదే నా యొక్క ఉదేశ్యం’ అని చెప్పాడు భాను.