తెలంగాణ రాష్ట్రం లో కరోనా రోజు రోజుకి పెరుగుతుంది. ఆగష్టు నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సూచన చేస్తున్నాయి. జులై 31న కొత్తగా 2083 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీ లో 578 కేసులు, రంగారెడ్డిలో 228 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 64786 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి మరియు మొత్తం 503 మంది మృతి చెందినట్టు సమాచారం. అయితే 46502 మంది కరోనా నుండి విముక్తి పొందారు ఇంకా 17754 మంది చికిత్స పొందుతున్నారు
భారతదేశం మొత్తంలో ఇప్పటి వరకు 16,95,988 కేసులు పాజిటివ్ గా నమోదు అయ్యాయి. 36,511 మంది మరణించారు.