The New York Times వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రపంచంలోనే అతి పెద్ద క్యాంపస్ అయినా Amazon’s Hyderabad క్యాంపస్ ఇంకా సుమారు 8000 మంది ఉద్యోగులకు ఉపాధి అందించగలదు అని చెప్పారు
15 అంతస్థుల భవనం అందులో మూడు అంతస్తులు ఇతర అవసరాల కోసం మరియు మిగిలిన 12 అంతస్తులు ఉద్యోగుల పని చేయు స్థలంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతానికి సుమారు 7000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు ఇంకా 8000 మందికి ఉపాధి అవకాశాలు ఉన్నటు తెలుస్తుంది.
ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయినా Machine Learning, Software Development, AI కి సంబందించిన సాఫ్టేవెర్ ల పై పని చేస్తున్నారు.
అమెజాన్ ఆఫీస్ సుమారు 68 ఎకరాల స్థలం లో అభివృద్ధి చేయడానికి ఆలోచనలు ప్రణాళికలు ఉన్నటు సమాచారం. ఈఫల్ టవర్ కట్టడానికి ఉపయోగించిన స్టీల్ కంటే సుమారు 2 .5 రేట్ల ఎక్కువ స్టీల్ ఈ క్యాంపస్ ని కట్టడానికి ఉపయోగించారు