సోమవారం రోజు ఆంధ్రప్రదేశ్ సర్కారు కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. పరిశ్రమల శాఖ మంత్రి అయినా మేకపాటి గౌతంరెడ్డి గారు మరియు ఏపీఐఐసీ ఛైర్పర్సన్ అయిన రోజా గారు విడుదల చేసారు. దేశం మొత్తం లో మన రాష్ట్రాన్ని మొదటి స్తానం లో ఉంచటం ఏ లక్ష్యం గా ఈ విధానం ఉంటుంది అన్నారు. కంపెనీలను ఆకర్షించే విధం గా పారిశ్రామిక విధానాన్ని రోపొందించాం అన్నారు. ఈ విధానం 2020 నుండి 2023 వరకు అమలు లో ఉంటుంది అని మరియు మెగా పరిశ్రమలు పెట్టేవారికి మరింత ప్రోత్సహకాలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఈ విధానం ద్వారా ప్రజకు మరి పెట్టుబడి దారులకు నష్టం జరగకుండా రూపొందించాం అని అన్నారు. అన్ని విధాలుగా సఫలం చేయడం కోసం 8 నెలలుగా విధానాన్ని రూపకల్పన చేయడం లో ద్రుష్టి పెటినటు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నారు. పారిశ్రామిక అనుమతులను వేగవంతం చేయడానికి వైఎస్ఆర్ ఏపీ వన్ పేరిట సింగిల్ విండో విధానాన్ని పెట్టినట్టు ప్రకటించారు.