bill-for-three-capitals-for-andhra-pradesh-gets-governors-approval

గవర్నర్ ఆమోదించినంత మాత్రాన బిల్లులు నిలబడతాయా?: బోండా ఉమా

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని వికేంద్రీకరణ బిల్లు ని ఈ రోజు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదించినట్లు గవర్నర్ ఆఫీస్ వెల్లడించింది. ఈ బిల్లు తో పటు CRDA రద్దు బిల్లు ని కూడా ఆమోదించినట్టు ప్రకటించారు.

ఈ విషయం పై తెలుగు దేశం పార్టీ సభ్యుడు బోండా ఉమా స్పందిస్తూ గవర్నర్ ఆమోదించినంత మాత్రాన కోర్ట్ పరిధి లో ఉన్న బిల్లులు ఎలా నిడబడతయి అన్నారు. న్యాయస్థాన పరిధి లో ఉన్న బిల్లులు తీర్పు రాకుండా ఆమోదించడం విడ్డురంగా ఉంది అన్నారు.

CRDA రద్దు బిల్లు మరియు రాజధాని వికేంద్రీకరణ బిల్లుని తమకు తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది అని బోండా ఉమా అన్నారు. ఈ వైస్సార్సీపీ ప్రభుత్వం బిల్లులను గవర్నర్ కు పంపించి, ఆయనకు తప్పుడు సూచనలు చేసి ఆమోద ముద్ర వేసేలా చేసారు అని అన్నారు.

గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అమరావతిని రాజధానిగ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకోని అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట మార్చడాన్ని తప్పుబట్టారు. అప్పుడు ఒప్పుకుని.. ఇప్పుడు మూడు రాజధానులని కావాలి అని ఎలా అంటారు? అని ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఆమోదించి ఏర్పరిచిన అమరావతి రాజధానిని మార్చడం దురదృష్టకరం అన్నారు. సీఎం జగన్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి, మూడు రాజధానుల అజెండాతో ప్రజల్లోకి వెళ్లి గెలవాలని సవాల్ విసిరారు.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం ని ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా, అమరావతి ని లెజిస్లేటివ్ కాపిటల్ గా మరియు కర్నూల్ ని జ్యూడిషల్ కాపిటల్ గా చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *