corona-virus-cases-andhra-pradesh

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా విజృభన, ఒక్క రోజే 10 వేల కేసులు

Andhra Pradesh

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో కరోనా కేసులు రోజు రోజు కి పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే చాలా జాగ్రతలు తీసుకుంటున్నప్పటి కేసులు పెరుగుతుండటం తో ప్రజలని జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. గతం లో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజు లో పది వేల కేసులు రావడం భయాందోళన కి గురిచేసినప్పటికీ, పరీక్షలు అత్యధికం గా చేయడం వాళ్ళ చాలా కేసులు వస్తున్నాయి అని ప్రజల్లో చర్చ మొదలయింది.

ఇది ఇలా ఉండగా గడిచిన 24 గంటలో 70,584 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ౧౦ వేల మందికి పైగా పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం కేసుల సంఖ్య 1,20,390 కి చేరింది. ఇప్పటివరకు 55,406 మంది కరోనా నుంచి కోలుకున్నారు అని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 63,771 కరోనా కేసులు ఆక్టివ్ గా ఉన్నాయి. 18 లక్షలకు పైగా పరీక్షలు చేసాం అని ప్రభుత్వం నుండి వచ్చిన నోటిఫికేషన్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.