crane-accident-in-vizag-ship-yard

వైజాగ్ లోని హిందూస్తాన్ షిప్ యార్డులో ప్రమాదం

Andhra Pradesh

వైజాగ్ లోని హిందూస్థాన్ షిప్ యార్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్ పనితీరుని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. దీనితో క్రేన్ కింద చాల మంది చిక్కుకుంటూ తెలుస్తోంది. ఇప్పటికే ఏడుగురు మరణించగా ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చు అని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది చర్యలు కొనసాగిస్తున్నారు.

పది సంవత్సరాల కింద ఈ క్రేన్ కి తీసుకువచ్చారని తెలుస్తోంది. క్రేన్ హిందూస్తాన్ షిప్ యార్డ్ కి సంబంధించింది అయినప్పటికీ ఇటీవలనే నిర్వహణ కోసం బయట వ్యక్తులకు ఇచ్చినట్లు సమాచారం. ఈ బారీ క్రేన్ 75 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ బరువు ఉండొచ్చు అని అంచనా. దీనిని బారి ఎత్తున ఐరన్ తరలించడానికి ఉపయోగిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *