Flipkart హైపర్ లోకల్ డెలివరీ ని అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది. ఈ కొత్త సర్వీస్ పేరు Flipkart Quick గా ప్రకటించింది మరియు ఈ సర్వీస్ కింద 2000 వరకు వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు నిత్యావరసర వస్తువులు, మొబైల్ ఫోన్ లు, ఎలెక్ట్రానిక్ పరికరాలు, స్కూల్ సంబంధిత వస్తువులు, పాల ఉత్పత్తులు మరియు ఇంట్లో అవసరం అయే వస్తువులు.
ఈ సర్వీస్ మొదటగా బెంగళూరు లోని కొన్ని ఏరియా లలో మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. వైట్ ఫీల్డ్, ఇందిరా నగర్, బనశంకరి, పానాథుర్, HSR లేఔట్, BTM లేఔట్ మరియు KR పురం ఏరియా లలో అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త సర్వీస్ లో కంపెనీ 90 నిమిషాల డెలివరీ లేదా రెండు గంటల స్లాట్ బుక్ చేసుకోవచ్చు. Flipkart తెచ్చిన ఈ సర్వీస్ ద్వారా మీరు రోజు మొత్తం లో ఏ టైం లో ఐనా బుక్ చేసుకోవచ్చు అదే రోజు డెలివరీ చేస్తుంది అందుకోసం 29 రూపాయలు ఛార్జ్ చేస్తుంది.
Goldman Sachs అనే కంపెనీ రీసెర్చ్ లో భాగంగా భారత్ లో 2024 వరకు ecommerce రంగం లో పెరుగుదల 27 శాతం ఉంటుంది అని తెలిసినది