Google-Meet-Chrome-Cast-New-Feature-for-online-classes

విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులు అందరికి సౌకర్యంగా ఉండేలా గూగుల్ మీట్

Technology

విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులు అందరికి సౌకర్యంగా ఉండేలా గూగుల్ మీట్ మరియు గూగుల్ డియోలో మరికొన్ని కొత్త ఫీచర్స్.

కోవిద్ కారణంగా లొక్డౌన్ మొదలు అయినప్పడినుండి గూగుల్ మీట్ మరియు గూగుల్ డియో లో ఎన్నో కొత్త ఫీచర్స్ వచ్చాయి. ఆన్లైన్ క్లాసుల వల్ల కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడేవారి సంఖ్య పెరిగింది వారందరికీ ఇంకా సౌకర్యంగా ఉండేలా వీడియొ కాంఫరెన్స్ ప్లాటుఫామ్ లో ఇప్పుడు మరో కొత్త ఫీచర్ వచ్చేసింది. గూగుల్ మీట్ లో మన వీడియొ ని chromecast ద్వారా TV లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీని వల్ల మనం వీడియోని మన టీవీ కి కనెక్ట్ చేసుకొని ఇంట్లో ఏ గది ని ఆయన వీడియొ కాంఫరెన్స్ గదిగా మార్చుకోవచ్చు.

విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు తమ ఇంట్లో టీవీ కి కనెక్ట్ చేసుకోవడం వల్ల తోటి విద్యార్థులను ఇంకా బోర్డు ని పెద్దగా చక్కగా చూడొచ్చు ఉపాధ్యాయులు కూడా పిల్లలందరిని ఒకేసారి సులువుగా చూడచ్చు.

ఇలా మన టీవీ కి కాస్ట్ చేసుకోవాలి అంటే గూగుల్ మీట్ వాడే వారికీ ఒక అకౌంట్ ఉండాలి మరియు కొత్తగా వచ్చిన chrome version ని update చేసుకొని ఉండాలి, దీనితోపాటు ఒక chromecast డివైస్ కూడా ఉండాలి. గూగుల్ కాస్ట్ ని గూగుల్ మీట్ వాడే వారందరు ఉపయోగించొచ్చు కానీ casting మాత్రం chromecast ఉన్న టీవీ లో మాత్రమే వాడొచ్చు.

అలాగే గూగుల్ డియో కూడా Android టీవీలలో ఒక కొత్త బీటా ని తీసుకొస్తుంది. గూగుల్ డియో ని వాడే వారందరు ఇప్పుడు టీవీలోనుంచే one-on-one మరియు గ్రూప్ వీడియొ కాల్స్ మాట్లాడొచ్చు, ఒకవేళ మన టీవీ కి కెమెరా లేదు అనుకుంటే మనం డైరెక్టుగా USB కెమెరాకి కనెక్ట్ చేసుకొని టీవీలోనే మాట్లాడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *