history-of-raksha-bandhan-rakhi

రాఖి చరిత్ర: అన్నాచెల్లెళ్లు అక్క-తమ్ముడు అనుబంధం రాఖి

Spiritual

మన తెలుగు రాష్ట్రాలతోనే కాదు భారతదేశం మొత్తం జరుపుకునే పండుగలలో రాఖి లేదా రక్షా బంధన్ ఒకటి. కొన్ని ప్రాంతాలలో రాఖి ని శ్రావణ పౌర్ణమి అని మరి కొన్ని ప్రదేశాలలో జంధ్యాల పౌర్ణమి అని అంటారు.

ఈ పండుగని అన్నాచెల్లి మరియు అక్కతమ్ముడుల ప్రేమానురాగాలకి గుర్తుగా జరుపుకుంటారు. ఉదయాన్నే లేచి, తలస్నానం చేసి, భగవంతుణ్ణి ప్రార్ధించి చెల్లెలు లేదా అక్కలు రక్ష ని అన్న లేదా తమ్ముడికి కడతారు.

ఆలా కట్టడం అనేది పూర్వకాలం నుండి మన పురాణాలలో చెప్తున్నా అన్నదమ్ముల అక్కచెల్లెల ప్రేమానుబందానికి ప్రతీక. రాఖి అనేది రక్షణ బంధం, సోద‌రులుల రక్ష కోరుతూ సోదరి కట్టే పత్రం. అందుకు బ‌దులుగా జీవితాంతం వాళ్ల‌ని కంటికిరెప్ప‌లా కాచుకుంటాన‌ని వాగ్దానం చేస్తారు సోద‌రులు. సోదరి తన సోద‌రులు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ సోద‌రులకు కట్టేదే ఈ రక్ష బంధనం.

పూర్వం దేవతలకు, రాక్షసుల కు మధ్య జరిగిన పుష్కరకాలం యుద్ధ సమయం లో ఓడిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకున్నాడు. ఇది చుసిన భార్య ఇంద్రాణి పరిష్కర మార్గాలు ఆలోచిస్తున్న సమయం లో రాక్షసుల రాజు దేవతల నగరం అయిన అమరావతిని ఆక్రమిస్తున్నారు అని తెలుసుకొని భర్త దేవేంద్రునిని యుద్దానికి సిద్ధం కమ్మని ఉత్సహాన్ని నింపుతుంది.

ఇదే సమయం లో ఆ రోజు రవాణా పౌర్ణమి అని తెలిసుకొని శివపార్వతులను మరియు లక్ష్మీనారాయణులను పూజించి ఒక రక్ష దేవేంద్రునిని చేతికి కడుతుంది అని మన పురాణాలలో చెప్పబడింది. దేవతలందరు ఆ రక్ష ద్వారా దేవేంద్రునికి శక్తినివ్వడం వలన యుద్ధం లో గెలిచి మరల త్రిలోకాధిపత్యాన్ని కాపాడుకుంటాడు. దేవేంద్రుని భార్య ద్వారా ప్రారంభించబడిన ఆ రక్షాబంధనం నేడు మనం రాఖి పండుగగా జరుపుకుంటున్నాం.

శ్రీకృషుడి మేనత్త అయిన శ్రుత‌దేవి కి శిశుపాలుడు జన్మించాడు. అతడు వికృత రూపం లో జన్మించాడు. భగవంతుని ప్రార్ధించగా ఎవరి చేయి తగిలి మాములు రూపానికి వస్తాడో అతని చేతిలోనే మరణిస్తాడు అని వరం పొందుతుంది. ఇది ఎలా ఉండగా శ్రీకిష్ణుడి చేయి తాకగా శిశుపాలుడు మాములుగా మారిపోతాడు. ఇది చూసి ఆశ్చర్య పోయిన శ్రుతదేవి బాధపడాలో ఆనందపడాలో తెలియక కృష్ణుడిని వేడుకుంటుంది. అది చూసి కరిగిపోయిన కృష్ణుడు వంద తప్పులవరకు క్షమిస్తా అని మాట ఇచ్చాడు.

శిశుపాలుడు దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తించేవాడు రాజ్య ప్రజలని పీడించేవాడు. ఎలా జరుగుతున్న క్రమం లో ఒకరోజు సభలో శ్రీకృషుడిని అవమానిస్తాడు. ఆ సమయానికి వంద తప్పులు వరం పూర్తవడం తో తన సుదర్శన చక్రం ప్రయోగించి శిశుపాలుడిని వదిస్తాడు. సుదర్శన చక్ర ప్రయోగ సమయం లో కృషుడి వేలు కు గాయం అవుతుంది. అది గమనించిన ద్రౌప‌ది తన చీర కొంగుతో శ్రీకృషుడికి రక్ష కడుతుంది. అందుకు అవసరమయిన సమయం లో చెల్లి ల ఆదుకున్నందుకు నీకు ఎలాంటి ప్ర‌మాదం వ‌చ్చినా నన్ను త‌లుచుకో! వెంట‌నే అన్నల వచ్చి నిన్ను ఆదుకుంటాను అని మాట ఇస్తాడు. అప్పటి నుండి అన్నచెల్లెల రక్ష బంధనం మొదలయింది.

శ్రీ మహావిశువు బలిచక్రవర్తి కోరిక మేరకు పాతాళ లోకం లోనే ఉంటాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్లి బలిచక్రవరికి రక్ష కట్టి శ్రీ మహావిశువుని వైకుంఠానికి తిరిగి తీసుకొస్తుంది. అందుకే రక్ష బంధానికి అంత ప్రాముఖ్యత ఏర్పడినది.

ఏది ఎం అయినా పురాణాలూ ఒకసారి చుస్తే రక్ష కట్టడం అనేది స్త్రీ శక్తి తో పురుషుడికి దైర్యన్ని ఇవ్వడం అని అర్థం అవుతుంది. ఈ కరోనా సమయం లో ప్రతి సోదరి రక్ష కట్టి ప్రతి సోదరుడికి ధైర్యాన్ని బలాన్ని చేకుర్చాలి. ప్రతి సోదరుడు తమ సోదరి కి అండగా శ్రీకృష్ణుడు ద్రౌప‌దికి అండగా ఉన్నటు ఉండాలి.

Leave a Reply

Your email address will not be published.