its-official-allu-arjun-and-siva-koratala-team

2022 లో అల్లు అర్జున్ తో శివ కొరటాల సినిమా?

Movies

అల్లు అర్జున్, దర్శకుడు శివ కొరటాల జతకడుతున్నారు సినిమా వర్గాల నుండి వచ్చిన కచ్చితమైన సమాచారం. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో 21 వ చిత్రం కాగా కరోనా వలన ‘పుష్ప’ చిత్రం పూర్తీ అయే సరికి సమయం పట్టేలా ఉండటం తో 2022 లో సినిమా ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా కొరటాల శివ గారు కూడా ‘ఆచార్య’ సినిమా తో బిజీ గ ఉండటం మరియు షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందో తెలియక పోవడం తో అల్లు అర్జున్ గారితో చేయాల్సిన సినిమా స్క్రిప్ట్ పనిలో ఉన్నారు. ఈ రెండు సినిమాలు అవగానే ఇద్దరు జతకడతారు. ఈ చిత్రం పేరు ప్రస్తుతానికి ఖరారు కాలేదు కనుక #AA21 గా పోస్టర్ విడుదల చేసారు.

కొరటాల శివ గారు తన సన్నిహితుడు అయిన మరియు డిస్టిబ్యూటర్ గా అందరికి సుపరిచితుడు అయిన సుధాకర్ మిక్కిలినేని తన యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించనున్నారు. సహా నిర్మాతలు గా అల్లు అర్జున్ స్నేహితులు శాండీ, స్వాతి, నట్టి ఉండబోతున్నారు.

అల్లు అర్జున్ గారి తాత గారు అయిన అల్లు రామలింగయ్య మరణ వార్షికోత్సవం సందర్భంగా, ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

కొరటాల శివ గారు మెగాస్టార్ చిరంజీవి గారి ‘ఆచార్య’ చిత్రం పనిచేస్తూ కరోనా మహమ్మారి వలన తన విలువైన సమయాన్ని కోల్పోయాడు కాబట్టి తన తదుపరి చిత్రాన్ని తొందరగా పూర్తి చేయాలి అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *