ktr-warns-left-parties-think-before-commenting-on-kcr

తెరాస కార్యకర్తల పేరు మీద 16.11 కోట్ల రూపాయ‌లు ప్రీమియం: కేటీర్

Telangana News

ముహూర్తబలం సంకల్ప బలం రెండు ఉంటె ఎంత గొప్పగా పార్టీ ఎదుగుతది అనడానికి ఈరోజు తెరాస నిదర్శనం. ఈ పార్టీ ఈరోజు ఈ స్థాయి లో ఉంది అంటే ఒక అజేయమైన శక్తి గా తెలంగాణలో ప్రతిపక్షాలన్నిటిని కటవితలం చేసి ప్రజల మనసును కొల్లగూటింది అంటే దీనిలో లక్షల మంది కార్యకర్తల త్యాగాలు, లక్షల మంది కార్యకర్త ల కష్టం వారి శ్రమ వారి రక్తం అన్ని రంగరిస్తేనే ఇక్కడిదాకా వచ్చింది. రోడ్డున పడే పరిస్థితి నుంచి ఈరోజు సగర్వంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నడిబొడ్డున రాజనీతి నిర్వహిస్తూ ఇక్కడ తెలంగాణ భవన్ లో కూర్చొని ఈరోజు 60 లక్షల మంది కార్యకర్తలకి 16.11 కోట్ల రూపాయ‌లు ఒక సంవత్సరం కి ఇన్సూరెన్స్ చెల్లించే స్థాయికి వచ్చినం. మా కార్యకర్తనలు కంటికి రెప్పలా కాపాడుకుంటాం వారికీ ప్రమాదబీమా కలిపించి వారిని ఆదుకుంటాం అని చెప్పే స్థాయికి తెరాస ఎదిగినందుకు ఈరోజు నేను గర్వపడుతున్న ఒక తెలంగాణ బిడ్డ గా సంబురపడతావున్న.

పెద్దలు ప్రొఫెస్సర్ జయశంకర్ సర్ ఎప్పుడు చెప్పేది పార్టీలు ఎన్నో ఉండొచ్చు పార్టీ లక్షలు ఎన్నో ఉండొచ్చు అధికారమే పరామవిది కావొచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని పార్టీల లెక్క కాదు. ఒక ఉద్యమ పార్టీ గా అవతరించి ఎన్నో త్యాగాలు, ఎన్నో ఆటు పోట్లు, ఎన్నో అవమానాలు, నీలాపనిందలు, కుట్రలు కుతంత్రాలు, ఎన్నో రకాల ఇబ్బందులు అన్ని ఎదురుకొని కెసిఆర్ గారి మాటలో చెప్పాలి అంటే ” అన్నం తిన్నారో కానీ అటుకులు బుక్కినారో ” గాని కార్యకర్తలు,నాయకులు సమిష్టిగా 13 ఏండ్ల పాటు తెలంగాణ సాధించినంత వరకు అప్రతిహతం గా పోరాటం చేసి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా అన్నింటిని తట్టుకొని ఎన్ని రకాల ఆటు పోట్లు ఎదురైనా అన్నింటిని తట్టుకొని ఈరోజు ఈస్థాయికి, అజేయమైన శక్తి అనిపించే స్థాయికి పార్టీ చేరుకున్నది.

పార్టీ మొదలు ఆవిర్భవించిననాడు అనుమానపు నీలి నీడలు తెలంగాణ ఉద్యమం అంటే నే ఇది కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకొని వ్యక్తుల స్వార్దాల కోసం వాడుకొని తుంగ లో తొక్కే ఒక నినాదం అని అప్పటికే ఒక అవిశ్వాసం ఏదైయితే సమాజం లో ప్రబలి పోయిందో వాటన్నింటిని ఛేదించి నేను తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి పక్కకు తప్పుకుంటే నన్ను రాల్లతోని కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన మహానాయకుడు ఆ విశ్వసాన్ని నింపిన మన నాయకుడు కెసిఆర్ గారు. అట్లాంటి అవిశ్వాసం అపనమ్మకం ఆనాటి అనుమానాలు వాటన్నిటిని పటాపంచలు చేస్తూ 13 ఏళ్ల తన ప్రస్థానం లో మొదాలు తెలంగాణ సాధన వరకు ముఖ్యమంత్రి గారు ఆ నాటి పార్టీ నాయకుడి గా ఉద్యమ నాయకుడిగా కనబర్చిన సాహసోపేతమైన ప్రస్థానం ఒక అంకం అయితే, పార్టీ అధికారంలోకి వచ్చినతర్వాత గత ఆరు సంవత్సరాలు గా ఆటు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా చేస్తున్న కార్యక్రమాలు మరొక అంకం గా చెప్పుకోకతప్పదు. మొదటి 13 ఏళ్ళు మరొకసారి చెప్పాలి అంటే మాములు కష్టాలు కాదు, పార్టీ ని చీల్చే కుట్రలు, పార్టీ ఉనికి లేకుండా చేసే కుట్రలు, కెసిఆర్ గారి మీద నీలాపనిందలు ఎన్నో రకాల ప్రయత్నాలు అన్ని జరిగినాయి.

కానీ ఈరోజు పార్టీగా నిలదొక్కుకున్న తరువాత ఒక లక్షాన్ని సాధించిన తర్వాత, ప్రణం ముఖర్జీ గారు ఒక గొప్ప మాట అన్నారు, ఆనాడు తెలంగాణ సాధన తరువాత కెసిఆర్ గారు ఢిల్లీ కి పోయి మా మొత్తం బృందం తో కలసినాడు అప్పటి రాష్ట్రపతి గొప్ప మాట అన్నారు. చంద్రశేఖర్ రావు గారు సాధారణంగా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని, ఆ ఆలక్ష్యాన్ని చేరుకోవడమే కష్టం అంటే, లక్ష్యం సాధించిన తరవాత దానికి నాయకత్వం వహించే దక్షత, అదృష్టం,ఆశీర్వాదం ప్రజలు మీకే ఇవ్వడం చాల గొప్ప విషయం, దాన్ని కాపాడుకోండి ఈ రాష్ట్రాన్ని బాగా చేసుకోండి అని చెప్పినారు.

పెద్దలు ఏదైతే సూచించారో, దానికి అనుకుణంగా నే ఈరోజు కార్యకర్తలు వారి శ్రమ ప్రజల ఆశీర్వాదం తో పార్టీ బ్రహ్మాడంగా ముందుకు పోతవున్నది. జయశంకర్ సర్ ఎప్పుడు ఒక్క మాట చెప్పేది పార్టీలు ఎన్నో ఉన్న మన తెలంగాణ ప్రజలకి, రాష్ట్రాని ప్రయోజనాలకు సంబందించి మాత్రం స్వీయ రాజకీయ అస్తిత్వమే మనకు శ్రీరామ రక్షా. తెలంగాణ ప్రజలకు, రాష్ట్రానికి రక్షణ కవచం ల ఉండగలిగేది ఒక తెరాస పార్టీ మాత్రమే అని మాట పలు మార్లు, పలు వేడుకలలో చెప్పడం జరిగింది. ఎందుకంటె వేరే పార్టీ వాళ్లకు 29 రాష్ట్రాలు ఉండొచ్చు, 100 ఎజండాలు ఉండొచ్చు కానీ తెరాస కి ఒకటే రాష్ట్రం, ఒకటే ఎజండా, ఒకటే లక్ష్యం అది తెలంగాణ ప్రజల బాగోగులు, తెలంగాణ రాష్ట్రం అనుకున్నంత గొప్పగా కష్టాల్ని నష్టాల్ని భరించి సాదించికున్న రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి, బహుముఖాభివృదే లక్ష్యం.

ఆ దిశలో పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వానికి మరియు పార్టీ కి ఆటు ప్రజలకు మద్యల వారధులు ఈ 20 సంవత్సరాలు చేసిన కృషిని మళ్ళొక్కసారి గుర్తుచేసుకుంటూ నాచేతులు జోడించి వారికీ హృదయపూర్వకమయిన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటె ఈ శ్రమ మాములు శ్రమ కాదు ఈరోజు పార్టీ ఇక్కడ ఇంత మందిమి కూర్చొని మంత్రులు గా MLAలుగా వివిధ హోదాలలో మాట్లాడుతున్నాం అంటే, ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నాం అంటే నాయకులు అయింది వందలు వేలు కావొచ్చు కానీ దాని యెనక లక్షల మంది కార్యకర్తల శ్రమ, త్యాగం ఇవన్నీ ఉన్నాయి అని గుర్తు చేస్తూ కచ్చితం గా గౌరవనీయులు కెసిఆర్ గారు ఏ ముహుర్తాన్నైతే ఈ పార్టీని స్థాపించారో ఆ అద్భుతమైన ముహూర్తబలం వాళ్ళ తెరాస పార్టీ వంద సంవత్సరాలు నిలదొక్కుకుంటాది అనే విశ్వాసం మళ్ళొక్క సారి వెల్లిబుచ్చుతూ ఈ జీవిత భీమా కార్యక్రమం ప్రారంభం అయినా నాటి నుండి నేటి వరకు పార్టీ పరం గా ఇప్పటికి మనం 47 కోట్ల 65 లక్షల ౯౩ వేల 8 వందల 80 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. దాని వాళ్ళ వేలాది మంది కార్యకర్తలకు వారు ప్రమాదం లో పడ్డప్పుడు వారి కుటుంబానికి కొంత చేయూతనిచ్చి కొంత ఉపశమనం కలిగించే తాత్కాలికంగానైనా గులాబీ సైనికులకు పార్టీ అండగా నిలిచింది.

పార్టీ భీమా ఇచ్చేది ఒక ఎత్తు అయితే స్థానిక నాయకులు ఎక్కడికిఅక్కడ మా పార్టీ ఇంచార్జిలు గాని శాసనసభ్యులు గాని స్థానికంగా ఉండే నాయకులు గాని ఏ కుటుంబ సభ్యుడికి ఇబ్బంది వోచిన ముందు ఉండి వారిని కాపాడే ప్రయత్నం కూడా చేసుకున్తున్నాం. కార్యకర్తల సంక్షేమం కోసం ఇంకా కొత్త కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచన కూడా పార్టీ లో ఉండి కెసిఆర్ గారు ఎం చేస్తే బాగుంటది అని కూడా ఆలోచిస్తున్నారు. గర్వం గా ఎక్కడ అనిపిస్తది అంటే ఈ రోజు మనం కట్టింది ఒకే ఒక్క సంవత్సరాని ప్రీమియం 16 కోట్ల 11 లక్షల రూపాయలు కట్టే స్థాయికి పార్టీ కార్యకర్తల నుండి చందాల రూపం లో ఇతరులు కొంతమంది పార్టీకి ఇచ్చిందే. ఈరోజు భారతదేశం లో ఏ పార్టీ కి లేనంత పటిష్టమైన ఒక యంత్రాంగం ఈరోజు తెరాస పార్టీ కి వుంది. జనాభా పరంగా చూసినట్లయితే మనది 12 వ అతి పెద్ద రాష్ట్రం అనుకుంట, 60 లక్షల మందికి ప్రమాద భీమా కట్టడం మాములు విషయం కాదు. ఒక ప్రాంతీయ పార్టీ ఒక అజేయమైన శక్తి ల ఎదిగింది.

ఇయ్యాల విమర్శకులు కూడా తెరాస పార్టీ ఒక అజేయమైన శక్తి గా ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఎన్నికలు ఏమైనా తెరాస అంటే ఒక తిడుగులేని రాజకీయ శక్తి గా ప్రజల ఆశీర్వాదం తో కార్యకర్తల శ్రమతో ఎదిగింది. కార్యకర్తలందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. తెరాస అనే ఒక కుటుంబం వంద యేండ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండే విధంగా నిర్మాణం చేసుకుందాం. జిల్లాలలో పార్టీ కార్యాలయాలు బ్రహ్మాండంగా 90 శాతం పనులు జరిగినాయి.ప్రస్తుతం ప్రజల ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి ముహుర్తాలకోసం కూడా చూసుకొని ఎప్పుడు యెట్లా చేయాలి అని ఆలోచిస్తాఉన్నాం. సుశిక్షులు అయినా సైనికులుగా తెరాస కార్యకర్తలు ఎదగాలి.

కరోనా తరవాత శిక్షణ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తాం. సమయానుకూలతని బట్టి ప్రారంభించుకుంటాం. కరోనా సంక్షోభం లో కూడా కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండండి అని విగ్యాప్తి చేస్తున్నా. పార్టీ పరంగా సుమారు 100 అంబులెన్సులను ప్రభుత్వానికి ఇస్తున్నాం. అన్నిరకాలుగా కార్యకర్తలని పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటది అని మల్లొకసారి చెప్తూ ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published.