బుధవారం ప్రెస్ తో మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ దవాఖానాలలో కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పట్లు చేసాం అని చెప్పారు. ఇటీవల నమోదు అయిన కేసులలో 19 శాతం మందికి మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయి అని మిగిలిన వారికీ లక్షణాలు లేవు అని తెలిపారు. ఒక్క బుధవారం రోజే 17 వేలకు పైగా పరీక్షలు చేసినట్టు చెప్పారు. రిటైర్డ్ డాక్టర్ల సేవలు కోరినట్టు సమాచారం అందించారు. ప్రతీ కరోనా రోగి కి ప్రభుత్వ దవాఖాన లో వైద్యం అందిస్తారు అని చెప్పారు.
కరోనా రోగులలో కేవలం 5 శాతం మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం అని ప్రజలు ఎవరు ఆందోళన చెందవొద్దు అని చెప్పారు. బస్తీలలో స్వాబ్ సేకరరణ పరీక్షలు చేయడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసాం అని మరియు కంటైన్మెంట్ జోన్లలో వీటిని అందుబాటులో ఉంచుతామని ప్రెస్ తో మాట్లాడారు. వైద్య సిబ్బంది ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.
28/07/2020 8 PM వరకు తెలంగాణ లో 1764 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 18858 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం 3,97,939 మందికి కరోనా పరీక్షలు చేసారు. తెలంగాణ(74.3%) లో రికవరీ శాతం దేశ(64% ) రికవరీ శాతం కంటే ఎక్కువ గ ఉంటడం మంచి పరిణామం.