minister-ktr-inaugurated-covid-icu-at-siricilla-hospital

సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ ఐసీయూ ప్రారంభించిన KTR

Telangana News

రాష్ట్ర మంత్రి శ్రీ కల్వకుంట తారకరామారావు గారు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా జిల్లా ప్రభుత్వ దవాఖాన లో కరోనా వ్యాధి సోకినా వారి కోసం కొవిడ్‌ ఐసీయూని ప్రారంభించారు.

ఈ దవాఖాన లో 40 పడకల ఆక్సిజెన్ వార్డు తో పటు అంబులెన్సు కూడా ఉన్నాయి మరియు పంచాయతీరాజ్‌ ఈఈ, డీఈఈ కార్యాలయ భవనాలకు కూడా మంత్రి KTR గారు శంకుస్థాపన చేశారు. సమావేశం లో మాట్లాడుతూ దవాఖానకు CSR పధకం కింద రూ. 2.28 కోట్ల నిధులు ఇస్తున్నామని తెలియజేసారు.సిరిసిల్ల జిల్లాలోనే రోజుకు వెయ్యి కరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

కరోనా బాధితులందరికీ హోం ఐసోలేషన్‌ కిట్లు ఇస్తామనిచెప్పారు. ఒకవేళ బాధితుల సంఖ్య పెరిగితే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను కూడా ఐసోలేషన్‌ కేంద్రాలుగా వాడుకోవాలన్నారు. అవసరాన్ని బట్టి అదనపు సిబ్బందిని తీసుకుంటాం అని చెప్పారు. కరోనా తో ప్రజలు భయపడొద్దు అని కాకపోతే చాలా జాగ్రత్తలు పాటించాలి అని చెప్పారు. మనం తీసుకునే జాగ్రతేలే మనకు కరోనా రాకుండా చేస్తుంది అన్నారు. ఏమైని కరోనా విషయాలు అవసరం అయితే ప్రభుత్వం 104 నెంబర్ కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అని చెప్పింది.

తెలంగాణ లో 99 శాతం మంది కోలుకుంటున్నారు అని వందకు వంద శాతం కోలుకోవాలాలి చర్యలు తీసుకుందాం మరియు భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ప్రభుత్వం తెసుకోవాల్సిన చర్యలు అన్ని తీసుకుంది అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.