ఈ రోజు మంత్రి కల్వకుంట తారకరామారావు గారు బైరామల్‌గూడలోని ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్యాకేజీ-2లో భాగంగా GHMC పరిధిలో 14 ఫ్లైఓవర్లను మొదలు పెట్టడగా ఇప్పటికే 4 ప్రారంభించారు. సోమవారం ప్రారంభించిన ఫ్లైఓవర్ తో 5 పూర్తయ్యాయి. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం లో నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు కూడా పాల్గొన్నారు. ఫ్లైఓవర్ పొడవు 780 ఉండగా వెడల్పు 12 మీటర్లు మరియు రూ.26.45 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారు.
ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో బైరామల్‌గూడ జంక్షన్, సాగర్ రోడ్ జంక్షన్ల పరిధిలో ట్రాఫిక్ సమస్య చాలావరకు తగ్గనుంది. ప్రస్తుతం ప్రతి గంటకు పన్నెండు వేలకు పైగా వాహనాల రద్దీ అనగా మరో పది సంవత్సరాలలో సుమారు ఇరవయి వెలవరకు చేరే అవకాశం ఉంది అని అంచనా తో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ శ్రీశైలంతో వెళ్లేవారికి చాల హైదరాబాద్ లో ట్రాఫిక్ కి అధిగమించడం సుళువుతారం కానుంది.