minister-ktr-traffic-problem-hyderabad

లింక్ రోడ్ల ద్వారా ట్రాఫిక్ సమస్య కి చెక్ పెట్టొచ్చు: KTR

Telangana News

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా 137 లింక్ రోడ్లని నగరంలో నిర్మిస్తున్నట్లు కల్వకుంట్ల తారక రామారావు గారు తెలిపారు. ఈ మిస్సింగ్ లింక్ రోడ్ల వలన ఇన్ని రోజులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని గ్రహినించి ట్రాఫిక్ సమస్య ని తగ్గించడానికి రోడ్ల నిర్మాణం లో ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నాం అని తెలిపారు. ఈ లింక్ రోడ్ల ద్వారా అన్ని ప్రాంతాలలో ప్రజలకి ట్రాఫిక్ సమస్య, సమయం మరియు ఇంధనం ఆదా అవుతుంది.

హైదరాబాద్ ని విశ్వ నగరంలా తీర్చిదిదే భాగంగా ఇండస్ట్రియల్ కరిడార్ అయినా సనత్‌నగర్‌, బాలానగర్‌ కలుపుతూ రూ. 68.30 కోట్లతో నిర్మించనున్న నాలుగులేన్‌ల రైల్వే అండర్‌ బ్రిడ్డి పనులకు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ గారి తో కలిసి మంత్రి కేటీఆర్‌ గారు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈ రైల్వే అండ్‌ బ్రిడ్జి నిర్మాణంతో సనత్‌నగర్‌, నర్సాపూర్‌చౌరస్తా, జీడిమెట్ల మధ్య ప్రయాణించే లక్షలాది మంది ప్రజలకు ట్రాఫిక్ సమస్య తీరుతుంది అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.