mukesh-ambani-on-2g-network

2G నెట్ వర్క్ లేని దేశం గా భారత్ ని మార్చడం నా లక్ష్యం: ముకేశ్ అంబాని

Technology

2జీ టెక్నాలజీ వచ్చి 25 సంవత్సరాలు అయింది. ప్రపంచం ఇప్పుడు 5G టెక్నాలజీ తో ముందుకు దూసుకు పోతున్న నేపథ్యం లో ముకేశ్ అంబానీ గారు మాట్లాడుతూ 2G టెక్నాలజీ వచ్చి 25 సంవత్సరాలు అయింది అన్నారు. ఈ 2G టెక్నాలజీ వలన సుమారు 30 కోట్ల మంది భారతదేశ ప్రజలు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ సదుపాయాలను పొందలేకపోతున్నారు అని అంబానీ అన్నారు. జులై తో రిలయన్స్ నిర్వహించిన AGM మీటింగ్ లో 5G టెక్నాలజీ లో అడుగు పెట్టబోతున్నారు చెప్పిన విషయం మనకి తెలిసినదే.

5G టెక్నాలజీ భారత్ లో వస్తున్నసందర్భం గా ముకేశ్ అంబానీ మాట్లాడుతూ 5G టెక్నాలజీ ఇండియా టెలికాం ఇండస్ట్రీ లో బారి మార్పులు తీసుకురాబోంతోంది అని, ఈ మార్పులు అందరికి అందుబాటులోకి రావాలి అంటే మనం 2G కి స్వస్తి చెప్పాలి అన్నారు.

1995 లో అప్పటి ప్రభుత్వ సంస్కరణ వలన మొబైల్ అండ్ టెలికాం సర్వీసుల రంగం భారత్ లో అందుబాటు లో కి వచ్చినప్పటి నుండి టెలికాం సంస్థలు కొత్త టెక్నాలజీ ని ప్రపంచానికి దీటుగా అప్డేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా ప్రపంచం లో నే అతి తక్కువ డేటా చార్జీలు గల దేశం గా ఉంది.

జియో మార్కెట్ లో కి రాగానే ఉచిత కాల్స్ మరియు అన్లిమిటెడ్ డేటా ప్యాకేజీ ని తీసుకురావడం తో ఒక పెద్ద సునామి ల జియో దేశం మొత్తం వ్యాపించిన సంగతి మనం చూసాం. ఇప్పుడు 5G తో ప్రపంచం భారత్ వైపు చూసే ల రిలయన్స్ సంస్థ తన కొత్త టెక్నాలజీ ని తయారీ చేసింది. కరోనా సమయం లో చాలా మంది విద్యార్థులకు, సాఫ్ట్ వెర్ ఎంప్లాయిస్ కి ఇంకా ఇతర వ్యాపారస్తులు జియో చాలా ఉపయోగ పడుతుంది అని మనకి తెలిసిన విషయం. ఇప్పుడు ప్రజలు తమ ఫోన్‌ ద్వారానే మేధస్సును పంచుకుంటున్నారని, వార్తలు, వీడియోలు చూస్తున్నారని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published.