New-feature-in-whatsapp-vacation-mode

వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్?

Technology

రొండు సంవత్సరాల కిందటనే ‘వాట్స్ అప్ లో వెకేషన్ మోడ్ అనే కొత్త ఫీచర్ తీసుకొస్తున్నారు అనే వార్తలు వచ్చాయి కానీ ఇప్పటి వరకు అది జరగలేదు కానీ ఈ ఫీచర్ మీద కొన్ని సంస్థలు పని చేస్తున్నారు అని ఎవిడెన్సులు ఉన్నటు తెలుస్తుంది .

అయితే ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఫీచర్ని తొందర్లో లాంచ్ చేసి ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తారు అని తెలుస్తుంది .

దానికోసం పని చేస్తున్న సంస్థ వాళ్ళు ఈ ఫీచర్ ని అభివృద్ధి చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఈ ఫీచర్ విషయంలో అందరికి ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏంటి అంటే అసలు వాట్స్ అప్ వెకేషన్ మోడ్ ఏంటి? ఎలా పని చేస్తుంది ? అని .

ఈ మోడ్ ఎలా పని చేస్తుంది అంటే మనం ఈ ఫీచర్ ద్వారా మన వాట్స్ అప్ చాట్ లిస్ట్ లో కొన్ని చాట్స్ ని ఎవరికీ కనబడకుండా హైడ్ చేసి పెట్టుకోవచ్చు అవి మెయిన్ చాట్ లిస్ట్ లో కనబడవు. ఇప్పుడు మనకు ఉన్న వాట్స్ అప్ లో మనం కొన్ని చాట్స్ ని ఆర్చీవ్ చేసుకుంటాం కానీ మల్లి ఎప్పుడయినా మనకి మెసేజీలు వస్తే ఆ చాట్స్ మల్లి మన చాటలిస్ట్ లో పైన కనబడుతాయి.

ఒక సారి ఈ ఫీచర్ బయటకు వస్తే ఇది ఒక సెక్షన్ కింద మన డెస్క్టాప్ మీద కనబడుతుంది మరియు మనము ఆ చాట్స్ ని నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు అని చెప్పారు WABeta info website లో .

ఇప్పటివరకు అయితే నోటిఫికేషన్ సెక్షన్ లో రొండు toggle బటన్స్ ఉన్నాయ్ అందులో మొదటిది మనకు వచ్చిన కొత్త మెసేజీలను నోటిఫికేషన్ రూపంలో మనకు చూపిస్తుంది దీని ద్వారా మన ఆర్చీవ్ సెక్షన్ లో ఏమయినా మెసేజీలు వస్తే మనకు తెలుస్తుంది ఒక వేళా ఈ ఆప్షన్ ని తీసెస్తే మన ఆర్చీవ్ చాటలిస్ట్ మొత్తానికే హైడ్ అవుతుంది .ఇందులో మరొక బటన్ ‘Auto Hide Inactive Chats ‘ఇది ఒక వేళా చాల రోజుల నుంచి(సుమారు ఆరు నెలల) ఏ చాట్ అయినా ఇనాక్టివ్ లో ఉంటె దానికిఅదే ఆర్చీవ్ చేస్తుంది ఆటోమెటికగా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *