SONU-SOOD-ADOPTED-THREE-CHILDREN-FROM-YADADRI-BHUVANAGIRI

మరో బాధ్యతని తీసుకున్న తీసుకున్న సొనుసూద్

India

ప్రముఖ నటుడు సోనూసూద్ మళ్ళీ తన మంచితనాన్ని చాటి చెపుతూ ఆపన్న హస్తాన్ని అందిచానికి సిద్ధం అయ్యారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన సత్యనారాయణ, అనురాధ దంపతులకు ముగ్గురు పిల్లలు జన్మిచగా తండ్రి ఒక సంవత్సరం క్రితం ఆరోగ్యం బాగాలేక మరణించడంతో తల్లి ముగ్గురిని చిన్న చిన్న పనులు చేసుకుంటూ పోషిస్తూ వచ్చింది. అనురాధ కూడా వారం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది.

ఈ విషయం తెలిసీ తెలియగానే సోనూసూద్ మనసు చలించిపోయింది. వెంటనే ఆ పిల్లలని ఆనాధలు కనివ్వను అని నేను ఉన్నాను పిల్లలకి అని ట్విట్టర్లో చెప్పారు. ఈ విషయం సోనూసూద్ వరకు ఎలా వెళ్ళింది అని ఆరా తీయగా పిల్లల పరిస్థితి చూసి తట్టుకోలేక తన దగ్గర పిల్లల్ని పెంచే స్తొమత లేక కారణం రాజేశం అనే వ్యక్తి ట్విట్టర్ లో సోనూసూద్ ని టాగ్ చేస్తూ ట్వీట్ చేసారు అని తెలిసింది. ఈ విషయంలో రాజేశంని అభినందించాలి. ఈ రోజులలో స్తొమత లేక పోయిన సాయం చేయాలి అనిపించడం గొప్ప విషయం.

సోనూసూద్ గారు పిల్లల భాద్యత తీసుకోవడం చాలా గొప్ప విషయం. కరోనా మహమ్మారి సమయం లో ఒక గొప్ప వ్యక్తి ప్రపంచానికి పరిచయం అయ్యారు అనుకోవచ్చు. సోనూసూద్ సినిమాలలో విలన్ కావొచ్చు కానీ నిజ జీవితం లో హీరో. దేవుడు సోనూసూద్ ని చల్లగా చూడాలి అని Digibook News తరుపున ప్రార్దిస్తున్నాము

Leave a Reply

Your email address will not be published.