ten-die-after-drinking-sanitizer-in-andhra-pradesh-amid-coronavirus-lockdown-police

కూల్ డ్రింక్ లో శానిటైజర్ కలుపుకొని తాగి 10 మంది చనిపోయారు: ఆంధ్రప్రదేశ్ పోలీస్

Andhra Pradesh

కోవిద్-19 కారణం గా లాక్‌డౌన్ పరిధిలోని ఒక గ్రామంలో మద్యానికి ప్రత్యామ్నాయంగా శానిటైజర్‌ను తగినట్లు ఆరోపణలు రావడం తో పోలీసులు అక్కడకి చేరుకొని విచారణ చేయగా కురిచేడు గ్రామానికి చెందిన కొంతమంది గత కొన్ని రోజులు గా కూల్ డ్రింక్ లో శానిటైజర్ కలుపుకొని తాగుతున్నారని ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ కౌషల్ తెలిపారు.

మొత్తం 10 మంది చనిపోయినట్టు గుర్తించారు. “శానిటైజర్‌లో మరే ఇతర విషపూరిత పదార్థాలు ఉన్నాయా అని మేము పరిశీలిస్తున్నాము. రసాయన విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి స్టాక్ ని పంపించాము అన్నారు”. ఇది చాలా విచార కరమైన సంఘటన అని ఈ ఘటన వెనుక ఇంకా ఏమైనా ఇల్లీగల్ దందా ఉందా అని ఎంక్వయిరీ చేస్తాం అన్నారు.

మరణించిన వారు మద్యానికి బానిస అయి లాక్‌డౌన్ కారణం గా అది లభించకపోవడం తో మద్యం ఉన్న నిటైజర్ తాగడానికి వీలుందని పోలీస్ లు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *