Transparent-Taxation-Honoring-the-Honest-platform

ఇక నుండి income tax శాఖ నుండి తప్పించుకోవడం కష్టం

India

నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ప్రపంచం లో చాల దేశాలకంటే ఇండియా లో టాక్స్ కట్టేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ అని అందరం క్రమం తప్పకుండ స్వచ్చందంగా టాక్స్ కట్టాలి అని చెప్తూ “Transparent Taxation-Honoring the Honest” platform ని లాంచ్ చేసారు.

ఇందులో ఆదాయపు పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెంచడం కోసం ప్రతి లావాదేవీ ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం అన్నారు. లక్ష రూపాయలకు పైగా బంగారం కొంటున్నవారికి, ఇరవై వేల కన్నా ఎక్కువ హోటల్ బిల్ కట్టే వాళ్ళకి, లక్ష కన్నా ఎక్కువ స్కూల్ ఫీజు కట్టే వాళ్ళ, ఏడాదికి లక్ష కరెంట్ బిల్ కట్టే వాళ్ళకి మరియు దేశీయంగా బిజినెస్ క్లాస్ లో ప్రయాణించిన వారు వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది.

జీవిత బీమా ప్రీమియం కింద 50 వేల రూపాయలు, ఆరోగ్య బీమా, ప్రాపర్టీ ట్యాక్స్ కింద 20 వేల రూపాయల పైబడిన చెల్లింపులు కూడా ఈ తనిఖీ పరిధిలోకి రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published.