trs-mla-solipeta-ramalinga-reddy

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు

Telangana News

తెలంగాణ లోని దుబ్బాక నియోజకవర్గం లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు అయిన సోలిపేట రామలింగారెడ్డి బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. 2001 నుండి ముఖ్యమంత్రి కెసిఆర్ తో కలిసి తెలంగాణ ఉద్యమం లో ప్రముఖ పాత్ర పోషించారు. చాలా కాలం జర్నలిస్టుగా పనిచేసి ఉద్యమ నాయకుడు అయిన కెసిఆర్ గారి పిలుపు తో 2004 లో ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెట్టారు.

57 సంవత్సరాలు నిండిన రామలింగారెడ్డి గారికి ఒక కుమారుడు మరియు కూతురు ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ లో అంచనాల కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్నారు. కొద్దీ రోజులుగా అనారోగ్యం తో భాద పడుతుండటం తో దవాఖాన లో చేరిన అయన కోలుకోలేకపోయారు. తుది వీడ్కోలు కోసం మంత్రి హరీష్ రావు గారు ముందు ఉంది కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కూడా హాజరు అయ్యారు. చాలా కాలం గా కలిసి పనిచేసిన వ్యకి మరణించడం తో శోక సంగ్రామం లో మునిగిపోయారు.

Leave a Reply

Your email address will not be published.