ts-govt-chalks-plan-make-hyderabad-warangal-and-karimnagar-cycle-friendly

కాలుష్యాన్ని అరికట్టే మరో ముందడుగు: తెలంగాణ ప్రభుత్వం

Telangana News

అసలు సగం కాలుష్యం మనం రోజు వాడే మోటార్ బండ్ల నుండే వస్తుంది దానిని పక్కకు పెట్టి మనం ఎన్ని మొక్కలు నాటిన కాలుష్యం పూర్తిగా తగ్గదు కాబ్బటి మన చుట్టు ఉన్న కాలుష్యాన్ని తగ్గించి ఈ సమస్యని ప్రరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం రాష్టంలో అన్ని వాహన రవాణాల లాగా సైకిల్ రవాణాలను కూడా అభివృద్ధి చేయాలి అని నిర్ణయించారు.

అయితే ఈ సైకిల్ రవాణాని దేశ వ్యాప్తంగా మొదలు పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్టాలకు ‘ఇండియా సైకిల్ 4 ఛాలెంజ్ ‘(C4C challenge) అనే ఛాలెంజ్ ని విసిరింది .ఈ ఛాలెంజ్ ని ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకొని తెలంగాణలోని కొన్ని ప్రముఖ ప్రదేశాలలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాం అని చెపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెపింది. ఇది తెలంగాణ యూనియన్ Ministry of Housing and Urban Affairs (MoHUA) వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తాం అని కూడా చెప్పారు.

దేశవ్యాప్తంగా ఈ ఛాలెంజ్ కి మొత్తం 95 పట్టణాలు ఒప్పుకున్నాయి అందులో మూడు పట్టణాలు తెలంగాణలోనివే అవి వరంగల్ ,కరీంనగర్ ,హైదరాబాద్ .
ఈ ఛాలెంజ్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC ) అధికార పరిధిలో జరుగుతుంది మరియు దానికి కావలసిన సమాచారం, ఛాలెంజ్ నిర్వహించడానికి కావలసిన సలహాలు Hyderabad Unified Metropolitan Transport Authority (HUMTA ) మరియు
Hyderabad Metropolitan Development Authority (HMDA) వారు చూసుకుంటారు అని చెపింది తెలంగాణ ప్రభుత్వం .

మొదట హైదరాబాద్ లోని సెంట్రల్ జోన్ కింద ఎంచుకున్న ఖైరతాబాద్ ప్రదేశంలో ఈ C4C ఛాలెంజ్ ప్రారంభిస్తాం అని చెప్పారు HUMTA ,GHMC వాళ్ళు దీనికోసం అధికారులు వివిధ ప్రదేశాల ట్రాఫిక్ పోలీసులతో సైకిల్ ట్రాక్స్ కోసం చర్చలు జరుపుతున్నారు .

అందులో భాగంగా ఖైరతాబాద్ లో 23 కిలోమీటర్ర్ల 7 సైకిల్ వే నిర్మించడానికి ప్లాన్ చేసారు కానీ మొదట ఒక 10 కిలోమీటర్ల సైకిల్ పట్టాలు అభివృద్ధి చేస్తాం అని చెప్పారు. ఇందుకు అనుకూలంగా రోడ్ల మీద మార్కింగ్లు ఇంకా ఇతర సౌకర్యాలు అభివృద్ధి చేస్తాం అని చెప్పారు

కొందరు కరోనా వైద్య ప్రముఖులు కూడా C4C ఛాలెంజ్ సోషల్ డిస్టెన్స్ పాటించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అని సలహా ఇచ్చారు.

ఈ ఛాలెంజ్ ని రొండు స్టేజిలలో అభివృద్ధి చేస్తారు దాని ద్వారా ప్రజలలో కూడా చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాం అని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.

అయితే అక్టోబర్ నెలాఖరి వరకు దేశంలో మొత్తం 11 రాష్టాలను ఈ ఛాలెంజ్ కోసం ఎంచుకుంటాం అని చెపింది సెంట్రల్ గవర్నమెంట్ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *