కరోనా చికిత్స చేయడం లో ప్రైవేట్ ఆసుపత్రులు అక్రమాలకు పాలుపడ్తున్నారు అని 800 వందలకు పైగా పిర్యాదులు వచినట్టు మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ వసూళ్లు చేస్తున్నారు. ఇష్టానుసారంగా డబ్బులు వసూళ్లు చేస్తూ బాధితులను ఇబ్బంది పెడుతున్నారు, ప్రతినిత్యం ప్రైవేట్ దవాఖానాలు చేస్తున్న మోసం పై ఎదోఒక వార్త వింటూనే ఉన్నాం.
ఈ సందర్భం లో ఒక కమిటీని నియమిస్తున్నారు తెలిపారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తగిన చర్యలు ఉంటాయి అని చెప్పారు. శనివారం రోజు జరిగిన సమీక్షా సమావేశం లో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మంత్రికి ఈ ఫిర్యాదుల గురించి సమాచారం ఇచ్చినారు. అవసరం అయితే దవాఖాన పర్మిషన్ ని కూడా రద్దు చేస్తాం అని హెచ్చరించారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో కొత్తగా 1819 కరోనా కేసులు నమోదు అయినట్టు హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. ఇప్పటికారకు మొత్తం 66,677కు చేరాయి. కోలుకొని డిశ్చార్జ్ అయినవారు 47,590 మంది. దీంతో రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 71.3 శాతం, మరణాల రేటు 0.80 శాతంగా ఉన్నది.కొత్తగా జీహెచ్ఎంసీలో 517 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 181, మేడ్చల్ జిల్లాలో 146, వరంగల్ అర్బన్‌లో 138 కేసుల చొప్పున ఉన్నాయి