we-will-have-to-buy-oxygen-cylinders-ts-minister-harish-rao-save-trees

ఆక్సిజన్ కొనాలి అంటే 5 కోట్లు ఖర్చు అవుతుంది: హరీష్ రావు

Health Tips

సిద్ధిపేట జిల్లలో అడవులను పెంచే అవగాహనా కార్యక్రమం లో భాగంగా మాట్లాడుతూ, మొక్కలు నాటడం పచ్చదనం పెంచుకోవడం వలన పరిశుభ్రమైన గాలిని పీల్చుకుందాం అని ఫైనాన్సు మినిస్టర్ హరీష్ రావు గారు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలిని ఇవ్వడం కోసం మొదలు చేసింది అన్నారు. చెట్లు తగ్గిపోవడంతో పర్యావరణం దెబ్బతింటోంది దానివల్ల గాలి లో ఆక్సిజన్ శాతం తగ్గుతోంది అన్నారు. ఇప్పటికే ఇలా కొన్ని ప్రదేశాలలో ఆక్సిజెన్ సిలిండర్లను కొనుక్కునే పరిస్థితి వొచింది అన్నారు.

సిద్దిపేట జిల్లాలో అడవులను పెంచే భాగంగా డ్రోన్ల ద్వారా విత్తన బంతులను జల్లుతాం అని చెప్పారు. ఉదాహరణకు ఢిల్లీ లాటి మహా నగరాలలో ఆక్సిజెన్ కరువు అయి ప్రజలు ఇబ్బంది పడ్తున్నారు అని మనం చాలా సార్లు వార్తలు వింటూనే ఉన్నాం అన్నారు. ఇలాంటి పరిస్థితి మనకి రాకూడదు అంటే మనం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక యుద్ధం లా చేద్ధాం అన్నారు.

ఒక అధ్యనం ప్రకారం ఆక్సిజెన్ లేక ఇబ్బంది పడ్తున్న ప్రాణదాతలలో ఒక మనిషి మూడు సీలిండర్లని కొంటున్నారు అని ఇలా జీవిత కాలంలో 5 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది అని అన్నారు. మనం అశ్రద్ధ చేస్తే ఇలాంటి పరిస్థితి మనకి కూడా రావొచ్చు అని అప్రమతంగా ఉండాలి అని సూచించారు.

Leave a Reply

Your email address will not be published.